పంట వేస్తున్న రైతులకే రైతు బంధు ఇస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేశామని తెలిపారు. తెల్లరేషన్ కార్డు లేని వారిని గుర్తించే ప్రక్రియ జరుగుతుంది.. అది అయిపోగానే అందరికి రుణమాఫీ అవుతుందని తెలిపారు.
BRS ఎగ్గొట్టిన 7625 కోట్ల రూపాయల రైతు బంధుని రైతుల అకౌంట్లలో వేశామని పేర్కొన్నారు. భూముల్లో పంట వేస్తున్న రైతులకే రైతు బంధు ఇస్తామని ప్రకటించారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత BRS ప్రభుత్వం భూముల్లో పంట వేయని వారికి రైతు బంధు ఇచ్చి 25 వేల కోట్లు వృధా చేసిందని తెలిపారు. రైతురుణమాఫీ ప్రక్రియ పూర్తికాగానే రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కానీ మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ మధ్య వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.