నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆరు యూనివర్సీటీలు

-

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని వెల్లడించారు. ఇందుకు తగ్గట్లుగానే అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీల వివరాలను టీెఎస్పీఎస్సీకి అందిస్తున్నాయి. ఖాళీల వివరాలు అందిన వెంటనే ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉద్యోగ ప్రకటనలు ఏక్షణమైనా రావచ్చనే ఉద్దేశంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు క్యూ కట్టారు. నిరుద్యోగులంతా పలు పట్టణాల్లో కోచింగ్ తీసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి ఆరు యూనివర్సిటీలు. ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకునే నిరుద్యోగుల కోసం ఈనెల 20 నుంచి కోచింగ్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించాయి. యూనివర్సిటీల్లో చదువుకునే యువత బయట కోచింగ్ సెంటర్ల బాట పట్టకుండా యూనివర్సిటీల్లోనే కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news