తెలంగాణాలో ఆన్ లైన్ మద్యం, ప్లాన్ ఇదే…?

-

లాక్ డౌన్ ఏమో గాని ఇప్పుడు మద్యం కోసం జనాలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. నిన్నటి నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వెర్షన్ 3 మొదలయింది. దీనితో గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ కి కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. మద్యం అమ్మకాలకు కూడా అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అంత వరకు బాగానే ఉంది గాని తెలంగాణాలో మాత్రం మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

దీనితో ఏపీ సరిహద్దుల్లో జనం మద్యం కోసం ఎగబడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు తెలంగాణా కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినేట్ సమావేశంలో మద్యం అమ్మకాల మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రీన్ జోన్ లో మాత్రం అనుమతి ఇచ్చి, ఆరెంజ్ జోన్ లో ఆన్లైన్ లో అమ్మకాలు మొదలుపెట్టాలని, సర్కార్ భావిస్తుంది. ఇప్పుడు మామిడి పళ్ళను పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తుంది సర్కార్.

ఇప్పుడు మద్యం అమ్మకాల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకోవాలని కాకపోతే వాలంటీర్లను ముందుకు వచ్చి మద్యం ఆర్డర్లు వాట్సాప్ ద్వారా తీసుకోవాలని, మద్యం షాపుకి 750 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ ఆర్డర్లను రోజుకి 300 మందికే తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై పూర్తి కసరత్తు చేసిన తర్వాత అమలులోకి తీసుకొచ్చే ఆలోచన సర్కార్ చేస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news