దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా భవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశంలో ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని, భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ అప్పు రూ.6.85 లక్షల కోట్లకు చేరింది.
రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాల తిరిగి చెల్లింపులకే సరిపోతుంది అని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్రానికి కేంద్ర మద్ధతు అవసరం చాలా ఉందన్నారు. రుణాల రీ స్ట్రక్చర్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. అదేవిధంగా ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో కేంద్రం నుంచి సహకారం కోరుతున్నాం. ఆర్థిక సంఘం సిఫార్సులు ఆ దిశగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.