తెలంగాణలో త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ

-

తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగుల ఆకాంక్షలను నిజం చేసేందుకు తమ సర్కార్‌ చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని పునరుద్ఘాటించారు. కోర్టు అడ్డంకులను తొలగించి 7వేల 94 మందికి సర్కారీ నౌకర్లు కల్పించామని తెలిపారు. విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో పదేళ్లుగా గత ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు కల్పించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని అన్నారు. వైద్యారోగ్యశాఖలో మరో 5 వేల ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news