గ్రామ సర్పంచుల పదవీకాలం నేటితో ముగియనుంది. ఇకపై గ్రామపాలన బాధ్యతలను ప్రత్యేక అధికారులు చేపట్టనున్నారు. ఇప్పటివరకు సర్పంచ్-ఉప సర్పంచ్ కు జాయింట్ చెక్ పవర్ ఉండగా…. ఇప్పుడు ప్రత్యేకాధికారి-పంచాయతీ కార్యదర్శికి ఇవ్వనున్నారు.
12,769 మంది ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. మేజర్ పంచాయతీలకు తహసీల్దారు, పెద్ద గ్రామాలకు ఎంపీడీవోలు, చిన్న గ్రామాలకు సీనియర్ అసిస్టెంట్ లు అధికారులుగా ఉండనున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంలో బుధవారమే వారి నుంచి చెక్ బుక్కులు స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.