తెలంగాణ నిరుద్యోగులకు అలెర్ట్. తెలంగాణ భర్తీ చేయనున్న 17 వేలకు పైగా పోలీసు అనుబంధ విభాగాల్లోని ఉద్యోగాలకు నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 20 వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలోనే.. నిరుద్యోగులు అప్లై చేసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ కోరింది.
ఎట్టి పరిస్థితుల్లో ఆ గడువు పెంచేంది లేదని పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు.. ప్రకటన చేశారు. అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
తుది గడువునకు మరో నాలుగు రోజేలే ఉండటంతో భారీ గా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో నాలుగు రోజుల సమయంలో ఉండటంతో.. ఆ సంఖ్య 7 లక్షలకు చేరే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.