ఈ రోజు తెలంగాణ రాష్ట్రము ఎటువంటి ప్రచార కార్యక్రమాలు లేకుండా మైకులు మూగబోయి ప్రశాంతంగా ఉంది. రేపు ఉదయం ఎన్నికలు ఆరంభం కానుండడంతో ఇప్పటికే ఏర్పాట్లు అనీ చాలా పకడ్బందీగా ఎన్నికల అధికారి వికాస్ రాజ్ నేతృత్వంలో జరుగుతున్నాయి. కాగా అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు తీసుకురానున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీగా ఎన్నికలకు వెళ్తున్న BRS మళ్ళీ గెలవాలని కోరుకుంటోంది. సర్వే ల ప్రకారం విజయం కాంగ్రెస్ కే దక్కవచ్చన్నది చాలా మంది అభిప్రాయం, ఇందులో కేసీఆర్ గెలుపు అవకాశాలను కూడా కొట్టిపారేయలేని పరిస్థితిలో ఉందని చెప్పాలి. మరి ఎవరు గెలిచినా ఖచ్చితంగా ఇకపై తెలంగాణాలో రాజకీయాలలో మార్పులు ఉంటాయన్నది వాస్తవం. రేపు ఎన్నికలు జరిగి డిసెంబర్ 3న ఫలితాలు వచ్చే వరకు అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి.
ఈ ఎన్నికల్లో హేమా హేమీలు కనుక గెలుపు సాధించకుంటే ఇవే చివరి ఎన్నికలు అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు అన్నది చూడాల్సి ఉంది.