KKR నా హృదయానికి దగ్గరైన జట్టు: గంభీర్

-

ఐపీఎల్ లో టైటిల్ సాధించడం ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు జరిగిన 15 సీజన్ లలో చెన్నై, రాజస్థాన్, కోల్కతా, ముంబై, దక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ లు మాత్రమే కప్ ను దక్కించుకున్నాయి. ఇంకా పంజాబ్, ఢిల్లీ, బెంగుళూరు మరియు లక్నో లు గెలుచుకోలేదు. ఈసారి జరుగనున్న ఐపీఎల్లో అయినా టైటిల్ కొట్టాలని కసిగా యాజమాన్యాలు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తమ లక్కీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ను సొంత గూటికి తీసుకుంది. గంభీర్ కెప్టెన్ గా ఉన్న సమయంలో 2012 మరియు 2014 లలో టైటిల్ గెలిచాడు. ఇప్పుడు రానున్న సీజన్ లో కోల్కతా మెంటర్ గా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. మెంటర్ గా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.. కోల్కతా జట్టు నా హృదయానికి చాలా దగ్గర అయిన జట్టుగా చెప్పుకున్నారు గంభీర్.

ఈ జట్టుతో నాకు ఉండే ఎమోషన్స్, హార్డ్ వర్క్, మేంరోయ్స్ అన్నటినీ మరోసారి ఎంజాయ్ చేయబోతున్నాను అంటూ పంచుకున్నాడు గంభీర్.

Read more RELATED
Recommended to you

Latest news