మిచౌంగ్’ తుపాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తుఫానుగా మారినట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. దీనికి మిచోంగ్…. అనే పేరును సూచించారు. ప్రస్తుతం ఇది ఏపీలోని నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కి.మీ, బాపట్లకు 250 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు-ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.

ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని…. రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు గాలులు వీస్తున్నాయని ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news