గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారి తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో… మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇక వాతావరణ శాఖ చెప్పినట్లే ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాదాపు తెలంగాణలోని 20 జిల్లాలలో ఇవాళ ఉదయం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇటు హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.