Vaccination : వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రికార్డు.. 6 కోట్ల డోసుల పంపిణీ

-

క‌రోనా నియంత్ర‌ణ పంపిణీ చేసే వ్యాక్సినేషన్ లో తెలంగాణ రాష్ట్రం అరుదైన రికార్డును సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 6 కోట్ల డోసులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు పంపిణీ చేసిన 6 కోట్ల డోసుల‌ల్లో.. 3.11 కోట్ల మంద‌కి ఫ‌స్ట్ డోసు, 2.83 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి అయ్యాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కాగ మూడో డోసుల‌ను ఇప్పటి వ‌ర‌కు 5.18 ల‌క్షల మందికి పంపిణీ చేసిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. అలాగే 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న పిల్ల‌ల‌కు 19 శాతం మందికి క‌రోనా నియంత్ర‌ణ టీకా పంపిణీ చేశామ‌ని తెలిపారు. కాగ బూస్ట‌ర్ డోసును రెండు డోసు తీసుకున్న తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిబంధ‌న పెట్టింది.

కాగ బూస్ట‌ర్ డోసు పంపిణీ ఈ ఏడాది జ‌న‌వ‌రి 10 నుంచే ప్రారంభం అయింది. కాగ ప్ర‌స్తుత స‌మ‌యంలో చైనా తో పాటు ఇత‌ర దేశాల్లో క‌రోనా మ‌ళ్లీ వ్యాప్తి చెందుతుంది. దీంతో 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ బూస్ట‌ర్ డోసు పంపిణీ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news