అన్ని రంగాల్లో తెలంగాణ ఆర్టీసీ ఫస్ట్.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ ఆర్టీసీ అన్ని విధాల ముందుంది అని,  ఆదాయం పెరుగుతుందని, త్వరలోనే ఆర్టీసీ పెండింగ్ బిల్లును చెల్లించేందుకు చర్యలు చేపడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  గత 10 సంవత్సరాలుగా ఉంటుందో ఊడుతుందో అనే ఆర్టీసీని సిబ్బంది సహకారంతో లాభాల్లోకి తెచ్చామని ఆర్టీసీ మంత్రిగా చెబుతున్నాను. రైతు రుణమాఫీ కాంగ్రెస్ వాళ్లకు అనడం టీఆర్ఎస్ అవివేకం అన్నారు.  రాని వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసుకు వెళితే సమస్య ఏంటి అనేది చెబుతారు.

అసెంబ్లీలో సబితమ్మపై చర్చ మధ్యలో మాట్లాడారు. కానీ  కావాలని కాదు. అదే మా గిరిజన మహిళను నాలెడ్జ్ లేదన్నారే..? ఇరు రాష్ట్రాల సీఎంలు కప్పు నాది.. సాసర్ నిధి అనే విధంగా సమస్యల పరిష్కారానికి విభజన హామీల నిధులు తెచ్చుకోవడం కోసం కలిశారు. కేసీఆర్ సభకు రాకపోవడానికి ఆరోగ్య,రాజకీయ ఆరోగ్య కారణం కావోచ్చు లేదా దళిత స్పీకర్ ని అధ్యక్షా అని పిలవలేని స్థితిలో ఉండొచ్చు. కేంద్రాన్ని మా సీఎం వెళ్లి కలిశారు.  మేము వెళ్లి మంత్రులను కలిసాం. ఏమి చేయకపోగా తిరిగి మా మీదే రాజకీయ దాడి చేస్తున్నారు అది వారి విజ్ఞత అన్నారు. తెలంగాణ కేంద్ర మంత్రులు ప్రజల తరఫున ప్రజల గొంతుకై మాట్లాడాలి. బీజేపీకి ముందు నుండే తెలంగాణ మీద కక్ష ఉంది. పార్లమెంటులో పీఎం తలుపులు మూసుకొని తెలంగాణ చేసుకున్నారని అది రూల్ ప్రధానికి తెలియదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news