అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం

-

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న యువత అక్కడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరేమో హత్యలకు గురవుతూ కన్నవాళ్లకు శోకం మిగుల్చుతున్నారు. తాజాగా అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.  తెలంగాణకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా అక్కడి పోలుసులు గుర్తించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లెగా గుర్తించారు.

గ్రామస్థులు, కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొ ట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య చదువుకుంటూనే పార్ట్‌టైం జాబ్‌ కూడా చేస్తోంది. ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో దూరం కావడంపై తల్లిదండ్రులు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సౌమ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వీలైనంత త్వరగా తమ కుమార్తె మృతదేహాన్ని భారత్ కు రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సౌమ్య తల్లిదండ్రులు వేడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news