సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గంజాయి కలకలం… ఐదుగురు అరెస్ట్

-

తెలంగాణలో నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి సాగు, రవాణాపై పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు ప్రత్యేక నిఘా పెట్టి వరుస దాడులు చేస్తూ నిందితులను అరెస్టు చేస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా కొందరు మారట్లేదు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు.

తాజాగా నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గంజాయి కలకలం రేపింది .పోలీసులు సోమవారం 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు.ఒడిశా నుంచి నాందేడ్‌కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయిని సీజ్‌ చేసి.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news