BREAKING : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

-

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ – 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలు వెల్లడించారు. టెట్ పేపర్-1లో 67.13 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించగా పేపర్-2లో 34.18 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-1లో మొత్తం 85,996 మందికి అర్హత సాధించిన 57,725 మంది, పేపర్-2లో 1,50,491 మందికి 51,443 మంది క్వాలిఫై అయ్యారు. schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరిగింది. మే 20వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు.. ఫలితాలను సిద్ధం చేశారు. టెట్‌ పేపర్‌-1కు 85,996 మంది, పేపర్‌-2కు 1,50,491మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news