మెగా బ్రదర్స్ తో ప్రధాని మోడీ సందడి..!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ అబ్దుల్ నజీర్  సీఎంగా చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే నారా లోకేష్, అచ్చెన్నాయుడు, రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, అనిత, సవిత, సత్యకుమార్, రామానాయుడు వంటి వారు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

ప్రమాణం చేసిన వారిలో టీజీ భరత్ మాత్రం ఇంగ్లీషులో ప్రమాణం చేసి అందరినీ  ఆకట్టుకున్నాడు. మెగా బ్రదర్స్ తో ప్రధాని నరేంద్ర మోడీ సందడి చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రమాణ స్వీకారోత్సవం వద్ద ఈ సీన్ అందరినీ ఆకట్టుకోవడం గమనార్హం. అలాగే రజినీకాంత్, రామ్ చరణ్, పలువురు సీఎంలు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ తమిళి సై వంటి వారిని కలిశారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news