ట్రాఫిక్ పోలీసులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎండనక, వాననక నిరతరం ప్రజల కోసం కష్టపడుతూ.. ఆరోగ్యం పాడవుతున్నా, కాలుష్యాన్ని ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ లు పెంచుతున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్రంలో 4,952 మంది ట్రాఫిక్ పోలీసులకు వారి బేసిక్ జీతంపై 30% అదనంగా చెల్లిస్తున్నామన్నారు. మరోవైపు వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన 1990 బ్యాచ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హోంమంత్రి మహమూద్ అలీ ఈ విషయన్ని తెలియజేశారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసెంబ్లీ సమావేశాల అనంతరం గన్‌పార్క్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ట్రాఫిక్ జరిమానాలు ఆపేయాలని.. ప్రభుత్వం వారికి ఏదో టార్గెట్ ఇచ్చినట్టు ట్రాఫిక్ జరిమానాలు వసూలు చేస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే.