భద్రాద్రిలో నేడు శ్రీ కృష్ణ అవతారంలో దర్శనమివ్వనున్న శ్రీరామచంద్ర స్వామి

-

భద్రాద్రిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీరామచంద్ర స్వామి శ్రీ కృష్ణ అవతారంలో దర్శనమివ్వనున్నారు. కిట్టయ్య రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. కన్నయ్యను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి సాధారణ రోజులకంటే ఎక్కువగా పెరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు ఉత్సవాల్లో భాగంగా రేపు గోదావరిలో సీతారాములకు తెప్పోత్సవ వేడుక నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈనెల 23వ తేదీన ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఈనెల 23వ తేదీ వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. https://bhadradritemple.telangana.gov.inలో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news