కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైంది : సీఎం రేవంత్ రెడ్డి

-

టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందనే ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  తన పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసిందని అన్నారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తానని, అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

CM Revanth Reddy is a good news for Telangana lawyers

సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, కొత్త పీసీసీ చీఫ్ నిర్ణ‌యంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని రేవంత్ కోరారు. అధిష్ఠానం ఎవర్ని నియమించినా వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అని అన్నారు. తాను టీపీసీసీగా ఉన్న కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచామని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలకు మించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసం అయింది. కేసీఆర్ గద్దె దించాలన్న ఆకాంక్ష నెరవేరింది. సీఎం కావాలనే తన కోరిక కూడా నెరవేరినట్టు వెల్లడించారు రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news