తెలంగాణలో రాగల మూడ్రోజులు భారీ వర్షాలు

-

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఈ ప్రభావంతో గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి తెలంగాణ రాష్టంలోని నిజామాబాద్​ దిశగా వెళ్తున్నాయి. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా నైరుతి దిశ నుంచి వీస్తున్నాయి. ఇవాళ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు నిజామాబాద్​, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్​ మల్గాజిగిరి, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి, మహబూబ్​నగర్​, నాగర్​ కర్నూల్​, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. సోమవారం కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news