తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్..?

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది .తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం పనిచేస్తున్న కిషన్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయ సాధించారు. అలాగే మల్కాజ్ గిరి లోక్సభ స్థానము నుంచి ఈటల రాజేందర్ గెలిచారు.

అయితే రెండో సారి కూడా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది. అంతేకాకుండా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన బండి సంజయ్కి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర పదవిని ఈటల రాజేందర్‌కు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎంపీ ఈటల రాజేందర్‌కు సంకేతాలు పంపారని ప్రచారం జోరుగా సాగుతుంది.అమిత్ షాను సోమవారం ఎంపీ ఈటల రాజేందర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ తో అమిత్ షా చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. కాగా, ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలవగా ఏపీలో ముగ్గురు ఎంపీలు గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news