బిగ్ అలర్ట్… తెలంగాణకు భారీ వర్షాలు

-

తెలంగాణ ప్రజలకు అలర్ట్‌. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఈ నెల ఇవాళ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలంగాణ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఇది తీవ్రమైతే ఈనెల 18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు చెప్పారు. శుక్రవారం ఉత్తర కోస్తాంధ్ర పై 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం స్వల్పంగా వర్షాలు కురిసాయి. అత్యధికంగా గూడూరులో 2.5, లోకరిలో 2.3 సెంటీమీటర్లు కురిసింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అదనంగా పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అత్యధికంగా నల్గొండ జిల్లాలో దామెరచర్లలో 38.7° ఉష్ణోగ్రత నమోదయింది.

Read more RELATED
Recommended to you

Latest news