పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ.3,14,545 కోట్లు అని తేల్చేసింది లోక్‌సభ. 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు కేవలం 3,50,520.39 కోట్లు మాత్రమేనని వెల్లడించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నవి అసత్య ప్రచారాలని లోక్‌సభలో తేల్చి చెప్పింది కేంద్ర ఆర్థికశాఖ. తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 3,14,545.68 కోట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాల ద్వారా 18,057.16 కోట్లు.. స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి 13,194.39 కోట్ల రుణాలు తీసుకున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

ఓవర్ డ్రాఫ్ట్ సహా వేస్ అండ్ మీన్స్ కింద ఉన్న అప్పులు 999.62 కోట్లు, ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా తీసుకున్న అప్పు 4723.16 కోట్లుగా పేర్కొంది. 2014–15 నుండి 2017–18 వరకు తెలంగాణ అప్పులు ఆస్తులు ఒకే రకంగా ఉండగా, 2018–19 నుండి అప్పుల కంటే పెద్ద స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. 2018–19 నుండి 2023–24 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరం అప్పుల కంటే రూ.50 వేల కోట్లు పైగా ప్రభుత్వ ఆస్తులు పెరిగాయని తెలిపింది ఆర్థిక శాఖ విభాగం. 2023–24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు 3,50,520.39 కోట్లు కాగా ప్రభుత్వ ఆస్తులు 4,15,099.69 కోట్లుగా ఉన్నాయని లోక్‌సభ సాక్షిగా తెలిపింది కేంద్ర ప్రభుత్వం.