తెలంగాణ అభ్యర్థులకు అలర్ట్.. ఈనెల 9న టెట్ హాల్ టికెట్లు విడుదల

-

తెలంగాణ అభ్యర్థులకు అలర్ట్.. టెట్ ఎగ్జామ్ కు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి 2,83,620 అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జామ్ కు సమయం దగ్గర పడటంతో ఈనెల 9న హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

అభ్యర్థులు వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్, డేటా ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 15న ఉదయం 9:30 గంటలకు పేపర్-1 మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.

కాగా, టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 79,205 మంది టీచర్లు బదిలీ కోసం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న కాఫీని డీఈఓ ఆఫీసులో రేపటి లోపు అందిస్తే… దానిని పరిశీలించి ఈనెల 8, 9న సీనియారిటీ ప్రకారం లిస్ట్ ను రెడీ చేసి వెబ్సైట్ లో పెడతారు. ఈనెల 15 హెచ్ఎంలకు ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news