గూగుల్ వచ్చిన తరువాత గురువుల అవసరమే లేదు – మంత్రి ఆదిమూలపు సురేష్

-

గూగుల్ వచ్చిన తరువాత గురువుల అవసరమే లేదంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న టీచర్స్‌ డే నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆదిమూలపు సురేష్‌. గురువుల అవసరమే లేదంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలపై టీచర్స్‌ యూనియన్‌ ఫైర్‌ అవుతోంది. ఇది ఇలా ఉండగా, చంద్రబాబు దొంగని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు తెలుసు..ప్రతీసారీ తప్పించుకుని పోతున్నాడని ఆగ్రహించారు మంత్రి ఆదిమూలపు సురేష్.

ఏదో రకంగా కోర్టులను మేనేజ్ చేసుకుంటూ మనుగడ సాగించాడు..ఇవాళ దొంగ దొరికాడు..ముందు నుంచి మేము ఏదైతే చంద్రబాబు గురించి చెబుతున్నామో అదే నిజమని తేలిందన్నారు.చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని…పూర్తి ఆదారాలతోనే ఆయనకు నోటీసులు ఇచ్చారని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్. తనపై వచ్చిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి..అమరావతి కోసం తన అస్మదీయులకు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్ల రూపంలో వేల కోట్లు తీసుకున్నారన్నారు. నారా లోకేష్ పాత్ర కూడా స్పష్టంగా ఉంది..జమీలీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news