నెట్టింట వైరల్ అవుతున్న TGSRTC కొత్త లోగో ఫేక్ : ఎండీ సజ్జనార్

-

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరు టీజీఎస్‌ఆర్టీసీగా మార్చినట్లు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాల పేర్లనూ మార్చింది. అయితే టీజీఎస్ఆర్టీసీపై నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ ఓ లోగోకు సంబంధించిన ఫొటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇది కాస్త ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వచ్చింది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు.

తాము ఇంకా ఆర్టీసీ కొత్త లోగోను అధికారికంగా విడుదల చేయలేదని ఎండీ సజ్జనార్ తెలిపారు. కొత్త లోగో విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఫేక్ లోగో అని, కొత్త లోగోను టీజీఎస్ ఆర్టీసీ ఇంకా ఫైనల్ చేయలేదని అసలు సంగతి చెప్పుకొచ్చారు సజ్జనార్. మరోవైపు టీఎస్ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీగా మారిన సందర్భంలో.. ప్రయాణికులు తమ సూచనలు, ఫిర్యాదులను ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాల ద్వారా అందించాలని కోరింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో వెల్లడించారు.

https://x.com/tgsrtcmdoffice/status/1793494151025017201

Read more RELATED
Recommended to you

Latest news