Jagityala: తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీష్ రావు..కలెక్టర్ ఆదేశాలు !

-

జగిత్యాల జిల్లాలోని పూడూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు హరీష్ రావు. అనంతరం హరీష్‌ రావు మాట్లాడారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని రైతులు తెలిపారని వివరించారు హరీష్‌ రావు.

Former minister and MLA Harish Rao visited the wood buying center at Puduru village in Jagityala district

ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు అన్నారని వివరించారు హరీష్‌రావు. తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని తనను కోరినట్లు హరీష్‌ రావు వెల్లడించారు. అనంతరం జగిత్యాల జాయింట్ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన హరీష్ రావు.. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news