కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి కార్మికులకు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మతాలను రెచ్చగొట్టి రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని చూస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికలలో ప్రకటించిన ఉచిత గ్యారెంటీ పథకాలు అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న నేటికీ అమలు జరగలేదు.
మహిళలకు ఉచిత బస్సు పథకం ఒక్కటే అమలు జరిగింది. రెండు లక్షల రుణమాఫీ కొంతమందికి లబ్ధి చేకూరింది. రైతు భరోసా నేటికీ అమలు జరగలేదు. మహిళలకు మహిళా శక్తి పథకం.. కార్మికులకు ఉపాధి పథకం అమలు కాలేదు.కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు గత పార్లమెంటు ఎన్నికలలో 28 పార్టీలతో ఇండియా కూటమిగా ఏర్పాటు చేసింది సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరినే అని పేర్కొన తమ్మినేని.. ఇండియా కూటమి బలంగా ఉండటం వల్ల బీజేపీ సీట్లను తగ్గించగలిగాం అని తెలిపారు.