బీఫామ్ నాకే వస్తుందన్న విశ్వాసం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా కొద్దికాలం మాత్రమే సమయం ఉంది. దీనితో రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. ఇక అధికార BRS సైతం ఇప్పటికే కొన్ని చోట్ల తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో ముసలం మొదలైంది.
గత కొంతకాలంగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే గా ఉన్న రాజయ్య మహిళా సర్పంచ్ వివాదంలో మునగడంతో, ఇతనికి టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్లేనని వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య మీడియా తో తనకు టికెట్ వస్తుందా రాదా అన్న విషయం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికి కేసీఆర్ గారిపై నాకు నమ్మకం ఉంది. స్టేషన్ ఘనపూర్లో మాదిగలు ఎక్కువ ఉన్నారని పేర్కొన్నారు. కాబట్టి బీఫామ్ నాకే వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు ఎమ్మెల్యే రాజయ్య.