ముగిసిన బీఏసీ సమావేశం.. బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్..!

-

స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొనగా.. బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.  ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి.

దాదాపు గంటన్నర పాటు బీఏసీ సమావేశం కొనసాగింది. అయితే సభ పని దినాలు, అజెండా పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని బీఆర్ఎస్, ఎంఐఎం స్పష్టం చేసింది. 15 రోజులు సభ పెట్టాలని.. ప్రతీ రోజు 0 అవర్ నిర్వహించాలని తాము కోరామని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. మీరు కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో తాము వాకౌట్ చేసినట్టు వెల్లడించారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version