మంత్రి కేటీఆర్ కి తప్పిన పెను ప్రమాదం

-

నేడు ( బుధవారం) వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కు పెను ప్రమాదం తప్పింది.వరంగల్, హన్మకొండ, నర్సంపేటలొ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కేటీఆర్.కొద్దిసేపటి క్రితం నర్సంపేటలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్మించిన ఎన్పీజీ గ్యాస్ ప్రాజెక్టును ప్రారంభించిన బహిరంగ సభలో మాట్లాడారు కేటీఆర్.కాగా మరి కాసేపట్లో వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది.అయితే ఆ బహిరంగ సభకు కేటీఆర్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా..బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.

వరంగల్ లో బుధవారం మధ్యాహ్నం గాలి దుమారం రేగింది.ఈ ప్రభావంతో కేటీఆర్ బహిరంగ సభ టెంట్లు కూలిపోయాయి.అయితే కేటీఆర్ సభకు హాజరు కాకముందే ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదమే తప్పింది.సభ ప్రారంభమయ్యాక ఈ ప్రమాదం జరిగి ఉంటే..కేటీఆర్ సహా చాలామంది నేతలు, భారీ సంఖ్యలో హాజరైన ప్రజలపై సదరు టెంట్లు కూలి ఉండేవి.ప్రారంభానికి ముందే ప్రమాదం జరగడంతో పెను ప్రమాదమే తప్పింది అని అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news