రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం

-

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతోపాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వారికి స్వాగతం పలికారు. కాసేపట్లో ఈసీ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

తెలంగాణలో త్వరలో ఎన్నికలు ప్రారంభం కానుండటంతో హైదరాబాద్ కి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం వచ్చింది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. రేపో, మాపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బృందం పలు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version