సీఎం రేవంత్‌ కు జోగులాంబ అమ్మవారి జ్ఞాపిక అందజేత

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని వారి నివాసంలో కలిసి జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనం అందించారు ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ఇది ఇలా ఉండగా, యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వడంపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. నిన్న తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news