పబ్లిసిటీ కోసం కేసులు.. పార్టీకీ తలనొప్పిగా మారిన వ్యవహారం..

-

పాలన బాగున్నా.. టీడీపీ నేతలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు చెయ్యడం మనం చూస్తూనే ఉంటాం.. కొన్ని చోట్ల అయితే ఆ పార్టీకి చెందిన టీడీపీ నేతలు పబ్లిసిటీ కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలు బెడిసి కొట్టాయి.. స్థానికంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు. అధికారులను బెదిరించేందుకు రాష్ట వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ ఈ నాలుగేన్నర ఏళ్ల లో ఎన్నో ఆందోళనలు చేసింది.. శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం.

ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడం వంటి కార్యక్రమాలు చేసి అధినేత చంద్రబాబు దృష్టిలో పడాలని చాలా మంది నేతలు సినిమా స్టంట్స్ చేశారు.. మరికొందరైతే.. పబ్లిసిటి కోసం వారానికొక ఆందోళన పేరుతో రోడ్డెక్కేవాళ్లు.. అయితే వారందరికీ పోలీసులు ఝలక్ ఇచ్చారు.. ప్రజాజీవనానికి ఇబ్బంది కల్గించారంటూ పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు.. వారిపై కేసులు నమోదు చేశారు.. ఈ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది.

పబ్లిసిటీ కోసం ఆందోళనలు చేశామని.. పోలీసులు కేసులు పెట్టారని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట.. కేసులు ఉంటే తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని తెగేసీ చెప్పారట.. అన్ని జిల్లాల నుంచి కేసుల వివరాలు తెచ్చుకున్న టిడిపి అధిష్టానానికి కేసుల ఫిగర్ చూడగానే దిమ్మ తిరిగిందట.. క్షేత్రస్థాయిలో ఉండే క్యాడర్ పై సుమారు 60 వేల కేసులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని టిడిపి వర్గాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాయట.. దీంతో టిడిపి లీగల్ సెల్ నీ చంద్రబాబు సంప్రదించారని పార్టీలో చర్చ నడుస్తుంది.

టిడిపి తో పాటు జనసేన కార్యకర్తలపై కూడా చాలా చోట్ల కేసులు నమోదవడంతో.. ఏం చెయ్యాలో అర్దంగాక ఆ రెండు పార్టీల అధినేతలు తలలు పట్టుకుంటున్నారట.. కార్యకర్తలను రెచ్చగొట్టడం.. పోలీసులపై దాడులు చేయించడం చంద్రబాబుకు అలవాటని.. ఆయన రాజకీయ క్రీడలో తాము కేసులు పెట్టించుకుని బలవుతున్నామని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేటా మునగడం ఖాయమని.. ఇక నుంచి అధినేత ఆందోళనలకు పిలుపునిస్తే తూతూ మంత్రంగా చెయ్యాలని కొన్ని జిల్లాలోని ముఖ్యనేతలు చర్చించుకోవడంలో పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.. పబ్లిసిటి కోసం రోడ్డెక్కడం అవసరమా అని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news