తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అక్టోబర్ 24న దసరా కానుకగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 వేలకు పైగా బడుల్లో ప్రారంభిస్తారు. 23 లక్షలపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయకుండా, మోడల్ స్కూళ్లు, మదర్సాలు, ఏయిడెడ్ పాఠశాలల్లోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ స్కూళ్లు 642, మోడల్ స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకు పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది.
మెనూ ఇదే
👉సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
👉మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ
👉బుధవారం – బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్
👉గురువారం – రవ్వ పొంగల్, సాంబార్
👉శుక్రవారం – మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్
👉శనివారం – గోధుమ రవ్వ కిచిడి, సాంబార్
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.