కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహుర్తం ఖరారు

 

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహుర్తం ఖరారు అయింది. జూన్ 17న కరీంనగర్ పట్టణ శివారులోని మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెన ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

ఈ మేరకు మంత్రి కేటీఆర్ ను సిరిసిల్ల పట్టణంలో విజయ, సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, మేయర్ వై.సునీల్ రావు తదితరులు మంత్రిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. కాగా,తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలోని దూర్శేడ్ గ్రామంలో రైతు దినోత్సవం నిర్వహించారు.

ఆ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఎడ్ల బండి నడుపుతూ రైతు వేదికకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.