బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఆర్జేడీ చీఫ్ లాలూ

-

నిన్న సాయంత్రం ఒడిశా రైలు దారుణమైన ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారతదేశం అంతా నిద్ర లేచింది అని చెప్పాలి. ఈ స్థాయిలో ఇంతకు ముందు ఎన్నడూ రైలు ప్రమాదం జరగలేదు, మొత్తం మూడు రైళ్లు ఈ ప్రమాదంలో పాలు పంచుకున్నాయి. గంట గంటకు ప్రమాదంలో మరణించిన వారికి సంఖ్య పెరుగుతూ పోతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 300 కు పైగానే మృతులు ఉన్నారు. ఇక తాజాగా ఈ ఘటనపై మాజీ రైల్వే మంత్రి మరియు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఈయన మాట్లాడుతూ ఈ ఘటనలో స్పష్టంగా నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.

ఈ ఘటనకు కారణమైన వారిని ఉన్నత స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈయన డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన చాలా బాధాకరం అని తన సంతాపాన్ని మృతుల కుటుంబాలకు తెలియచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news