మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహా సభకు హాజరైన ప్రధాని మోడీ ప్రసంగించారు. పండుగ సమయంలో మనకు కావాల్సిన వారి మధ్యలో ఉంటే.. సంతోషం రెట్టింపు అవుతుంది అన్నారు. గుర్రం జాషువా తన కష్టాలను కాశీ విశ్వనాథుడికి విన్నవించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు వచ్చాయి. కానీ సామాజిక న్యాయం అమలు చేసింది బీజేపీ మాత్రమేనని తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర వచ్చిన తరువాత పలు రాజకీయా పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి.
దేశంలో బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 30 ఏళ్లుగా మంద ష్ణ ఒకే లక్ష్యంతో పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి.. దళితుల ఆశలపై నీళ్లు చల్లి ఆ సీఎం కుర్చినీ కబ్జా చేశాడు సీఎం కేసీఆర్.