ప్రస్తుత పరిస్థితులు రోజు రోజుకు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్న వయస్సులో చెడు అలవాట్లకు బానిసలై తమ నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన జగిత్యాల గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
10వ తరగతి చదువుకునే విద్యార్థినులు గంజాయికి బానిసలు అవ్వడం చూసి పోలీసులే షాక్ కి గురయ్యారు. ఇక వెంటనే విచారణ చేపట్టి.. నిందితులను పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ముఠాని అరెస్టు చేశారు. వీళ్లంతా చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నారని తెలిసింది. ఇందులో ఒక బాలికకు గంజాయి ఇచ్చి దాదాపు ఏడాది కాలంగా అత్యాచారం చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. నిందితులు ప్రేమ్, వెంకటేశ్, నితిన్ గా గుర్తించారు. ఈ ముగ్గురిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు తతంగం వెలుగులోకి వచ్చింది.