తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనతో దెబ్బకు దిగి వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. పాలమాకుల గురుకుల విద్యార్థినుల ధర్నాకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం..10 మందిపై బదిలీ వేటు వేయడం జరిగింది. తమ సమస్యలపై గళం విప్పి జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన కేజీబీవీ విద్యార్థినుల ధర్నాపై వెంటనే స్పందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
శంషాబాద్ మండలంలోని పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల గురుకులంలో పనిచేస్తున్న పదిమందిని ఒకేసారి బదిలీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీరిలో బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారని సమాచారం అందుతోంది. పాఠశాల ఎస్ఓతో పాటు ఉపాధ్యాయులను వేరే చోట్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాగా, గత వారమే.. పాలమాకుల గురుకుల విద్యార్థినుల ధర్నాపై స్పందించి…అక్కడి వెళ్లి.. నిరసన తెలిపారు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు.