ఆదిలాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

-

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో తీవ్ర పంట, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు బీభత్సం సృష్టించగా, ఆదిలాబాద్‌లోనూ వాగులు ఉప్పొంగి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అయితే, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఆదిలాబాద్‌లో పర్యటించారు. ముంపు గ్రామాల్లో పర్యటించిన మంత్రి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రాణనష్టం సంభవించిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పశువులను కోల్పోయిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు. పెనగంగాను పరిశీలించిన మంత్రి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఓవైపు ముంపు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షాలు విమర్షలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీలు ఈ సమయంలో రాజకీయం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news