మారనున్న TSPSC పేరు.. కొత్త పేరు ఇదే..!

-

తెలంగాణ స్టేట్ కి బదులుగా సంక్షిప్త పదంగా ఇప్పటి వరకు వాడుతున్న టీఎస్ కు పేరును టీజీ గా మార్చాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అందులో ప్రభుత్వ కార్యాలయాల నేమ్ బోర్డులపై టీజీకి బదులుగా.. టీఎస్ అని రాయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు, లెటర్ హెడ్స్, అధికారిక పత్రాల్లో ఇక మీదట టీఎస్కు బదులు టీఎజీనే వాడాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ సంస్థలు టీఎస్ కు బదులుగా టీఎజీను రాస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్  పేరును టీఎస్ఎస్పీడీసీఎల్ గా మార్చారు. అయితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరును కూడా ప్రభుత్వం త్వరలో మార్చనున్నట్లు తెలుస్తోంది. దీనిని TGPSC మార్చనున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించి అధికారిక ఉత్వర్వులు వెలువడనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news