Hyderabd: విద్యుత్ కోతలు.. సబ్ స్టేషన్ ముట్టడించిన ప్రజలు !

-

Hyderabd: విద్యుత్ కోతలు భరించలేక.. సబ్ స్టేషన్ ముట్టడించారు హైదరాబాద్‌ నగర్ ప్రజలు. ఈ సంఘటన హైదరాబాద్‌ లో బుధవారం చోటు చేసుకుంది. మొన్న ఒక్కసారిగా కురిసిన వర్షానికి శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లోని పలు కాలనీ, బస్తీ లలో నిలిచిపోయింది విద్యుత్ సరఫరా.

The people of Hyderabad Nagar besieged the sub station

వర్షానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో కరెంటు సరఫరాను నిలిపివేశారు అధికారులు. గత ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసి విద్యుత్ తీగల పైకి వచ్చిన చెట్ల కొమ్మలను ముందుగానే ఏప్రిల్ నెలలో నరికి వేసి కరెంట్ సమస్య రాకుండా చూసేవారు.. ఈ ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోవడం వలనే విద్యుత్ సమస్య వచ్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సబ్ స్టేషన్ ముట్టడించారు హైదరాబాద్‌ నగర్ ప్రజలు.

 

Read more RELATED
Recommended to you

Latest news