Telangana: పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుడి బర్త్ డే వేడుకలు చేసిన సంఘటనలో..SI పై వేటు పడింది. ఆంధోల్ నియోజకవర్గం వట్ పల్లి ఎస్ఐ లక్ష్మణ్ పై వేటు వేశారు ఉన్నతాధికారులు. పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత బర్త్ డే వేడుక జరపడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
పోలీస్ స్టేషన్ లోనే కేక్ కట్ చేయించిన వట్ పల్లి ఎస్ఐ లక్ష్మణ్ పై వేటు వేశారు ఉన్నతాధికారులు. వట్ పల్లి ఎస్ఐ లక్ష్మణ్ ను VR కు పంపిన హైదరాబాద్ రేంజ్ ఐజి సత్యనారాయణ..అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆందోళన నియోజకవర్గం వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రమేష్ జోషి పుట్టిన రోజు సందర్భంగా… స్థానిక పోలీస్ స్టేషన్లో వేడుకలు నిర్వహించారు. అక్కడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు అందరూ కేక్ కట్ చేసి మరి రమేష్ జోసికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.