తెలంగాణలో మళ్లీ అధికారం టిఆర్ఎస్ దేనాని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. 100 సీట్లతో హ్యాట్రిక్స్ సర్కారు ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు. నిజామాబాదులో మీడియాతో చిచ్చాట్లో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పథకాల సృష్టికర్త అని ఇతర పార్టీల మేనిఫెస్టోను కాపీ చేయాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు.
బిజెపికి తెలంగాణలో అవకాశమే లేదని ఆ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది అన్నారు కోరుట్లలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ ను ఓడిస్తామని దీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ గ్యారంటీలను ఎవరు నమ్ముతారని పేర్కొన్నారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తుందన్నారు ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ రైతులుగా ఉంటాయని కవిత స్పష్టం చేశారు.తెలంగాణలో గత పదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు అని.. అందుకే రాష్ట్ర ప్రజలు మరోసారి బీఆర్ఎస్ కి పట్టం కడుతారని తెలిపారు.