తెలంగాణలో రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు ఫిబ్రవరి చివరి వరకు పొడిగింపు

-

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్‌ కార్డు దారులకు అదిరిపోయే శుభవార్త అందింది. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 31 వరకు కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్నవారు దగ్గర్లోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి, వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది.

The Telangana government has extended the e-KYC deadline for ration cards till the end of February

జనవరి 31 లోగా కేవైసీ పూర్తి చేసుకొని వారికి రేషన్ కట్ అవుతుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్‌ కార్డు దారులకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణలో రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు పొడగించింది సర్కార్‌.

రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు ఫిబ్రవరి చివరి వరకు పొడిగించింది ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఇక అటు గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు సిద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news