గుడ్ న్యూస్ : తెలంగాణాలో థియేటర్స్ కి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో సినీ ప్రియులకి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి దాకా కరోనా లాక్డౌన్ వల్ల మూసుకుపోయిన సినిమా థియేటర్స్ తెలుసుకోవచ్చని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అన్లాక్ ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగులు అలాగే సినిమా థియేటర్లు పునః ప్రారంభించుకోవచ్చని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్ వరదలకు సంబంధించి ప్రకటించిన విరాళాల చెక్కులను అందజేసేందుకు సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున లు సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలిశారు.

 

ఈ సందర్భంగా తెలంగాణలో సినీ పరిశ్రమలో ఎలా అభివృద్ధి చేయాలి ఇంకా ఏమి ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాల మీద చర్చ జరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సినీ పరిశ్రమ మీద ఆధారపడి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సుమారు పది లక్షల మంది జీవిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. థియేటర్లు కూడా ఓపెన్ చేయకపోవడంతో మరింత మంది ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్న కారణంగా థియేటర్ లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించారు