హైదరాబాద్ శివార్లలో 2000 ఎకరాల సినిమా సిటీ !

సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ ఒక శుభవార్త చెప్పారు. హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. మన సినీ ప్రముఖులు, అలానే ప్రభుత్వ అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం కేసీఆర్ ఈరోజు అధికారులను ఆదేశించారు.

ఈరోజు హీరోలు చిరంజీవి, నాగార్జున ప్రగతి భవన్ లో సిఎంను కలిశారు. వరద బాదితుల కోసం ప్రకటించిన చెక్ లు ఇచ్చేందుకు కేసీఆర్ ని వారు కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉందన్న కేసీఆర్ తమ ప్రభుత్వమె 2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుందని ప్రకటించారు. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుందని ఆయన ప్రకటించారు. ఎయిర్ లిఫ్ట్ సహా అందులోనే అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.