హైదరాబాద్ లో ఎక్కడా వెనక్కు తగ్గొద్దు : శ్రేణులకి బాబు ఆదేశం !

తెలంగాణాలో మళ్ళీ ఎలా అయినా పూర్వ వైభవం తెచ్చుకునేందుకు టీడీపీ అష్టకష్టాలు పడుతోంది. ఎలా అయినా ఒకరిద్దరు ప్రజాప్రతినిధుల నయినా టిడిపి తరఫున సభలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ రోజు టిడిపి గ్రేటర్ హైదరాబాద్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రేణులకు పలు కీలక సూచనలు చేశారు.

గెలుపు తో సంబంధం లేకుండా ప్రతి డివిజన్లో పార్టీ తరఫున అభ్యర్థి పోటీ లో ఉండే విధంగా ప్లాన్ చేయాలని ఆయన కోరారు. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో టిడిపి కీలక పాత్ర పోషించిందని ఆ విషయాన్నె చెబుతూ ప్రజల్లోకి వెళ్లండని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన నష్టపోయిన పేదలను ఆడుకోవడం లో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయండని ఆదేశించారు. ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని కేంద్ర పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని బాబు తెలిపారు.